Thursday, December 5, 2013

Dasaraa navaraatrulu - 9th day - శ్రీ రాజేశ్వరి అమ్మవారు



దసరా నవరాత్రుల చివరి రోజున అమ్మవారు రాజరాజేశ్వరిగా అవతార దర్శనం ఇస్తుంది. పరాశక్తి ప్రసన్న రూపముతో కరుణని ఙ్ఞానము గా ప్రసాదిస్తుంది. మహా త్రిపుర సుందరి గా నేటి రోజున పూజలందుకుంటుంది రోజున రాజరాజేశ్వరి అమ్మవారినిఅపరాజితగా పూజిస్తారు. అనగా పరాజయం కలుగక సదా జయాన్ని ప్రసాదించే శక్తి స్వరూపిణి.


రాజేశ్వరి అమ్మవారు విజయాన్ని ప్రసాదించే అపర్జిత గా,లలితాసనంలో కొలువు తీరి దర్శనం ఇస్తుంది. ఒక పాదము సింహాసనము మీదమరొక పాదము లోపలికి ఉంచిశ్రీ చక్రధారిని గా సింహాసనం అధిస్తుందిశ్రీ చక్రము మీద అధిష్టించిన కారణము చేత అమ్మవారు శ్రీ చక్రధారిని అని కూడా అంటారు.


రాజేశ్వరి ఆమ్మవారికి అవతారము యందు నాలుగు చేతులు కలవుపై భాగము నందు ఉండేది రెండు చేతులలో - ఒక చేతిలో అంకుశం (ఇది భూమిఆకాశం,నిప్పు.నీరు కి ప్రతీక), మరో చేతిలో పాశము ధరిస్తుందిపాశము లౌకిక మైన విషయములు కి ప్రతీక.అమ్మవారు ఇది ధరించటం చేత సన్మార్గం మైన విషయముల మీద బుద్ధిని,మనసుని చైతన్య పరచి ఉద్ధరిస్తుంది.

క్రింది చేతిలో పద్మముమరియు చెరుకు విల్లుని ధరిస్తుందిచెరుకు విల్లు మనసుకి ప్రతీకమన మనస్సుని ఈశ్వర పథం చేర్చేందుకు సన్మార్గం చూపేందుకు మన మనసుని తన ఆధీనం లో ఉంచిసత్బుద్ధిని ప్రసాదించే
కరుణామూర్తి - రాజేశ్వరిఇది రాజేశ్వరి తత్వము (అపరజిత తత్వము)సదా అనిత జయములను ప్రసాదిస్తుంది.

రాజేశ్వరి దేవి అంతర్యామి స్వరూపిణిసర్వోపస్యసర్వబుద్దియధిష్టాన దేవిప్రకృతి స్వరూపిణి అయి పరమేశ్వరుని తో మూడు లోకాలను పాలిస్తుందిజగన్మాత త్రియంబకేశ్వరిమూడు కన్నులు సూర్య,చంద్ర ఙ్ఞానములకు
ప్రతీకపరబ్రహ్మౌ ఒకటేఇది అనేక స్వరూపాలుగా దర్శనం ఇస్తుందిలలితదుర్గగాయత్రిలక్ష్మిశారదరాజేశ్వరి అంతయు ఒక్కటేయే నామము తో పిలిచినా పరాశక్తి పలుకుతుంది.

రాజేశ్వరి లలిత స్వరూపమందు సచ్చామర రమా వాణి సవ్య దక్షిణ సేవిత (లలిత సహస్ర నామము)గా కీర్తింపబడిన శక్తిస్వరూపిణిఅనగా మూల స్వరూపములు అయిన  లక్ష్మీసరస్వతి తో కలిసి మధ్యన తాను నిలబడి ఙ్ఞాన ప్రచోదనం చేస్తుందిలక్ష్మీ అనగా స్థిరమైన సంపదనుసరస్వతీ స్వరూపం అయి మోక్ష ఙ్ఞానాన్ని ప్రసాదిస్తుందిఆమె వాగ్భీజముసర్వ విజయాలను ఇచ్చి ఉద్దరించే ప్రసన్న రూపము.

నేటి రోజున విజయ దశమి అని అంటారు. నేడు ఆయుధ పూజ చేస్తారువిజయ దశమి  విజయానికి ప్రతీక. సమయములలో తలపెట్టిన యే కార్యమైనను విజయం సమకూరుతుందిఅమ్మవారిని  జయ మంగళ విజయ స్వరుపంగా దర్శించటమే విజయదశమిరాముడు రావణుడి ని జయించి, సీత అమ్మవారి ని పొందిన రోజు ని కూడా పలు చోట్ల విజయ దశమి గా జరుపుకుంటారుపది తలల రావణుడి ని సంహరించిరాముడు విజయం సాదించటం చేత విజయ దశమి అని అంటారువిజయ దశమి జరుపుకొనుటకు పలు చోట్ల ఇది కూడా ఒక కారణము.


దసర యందు బొమ్మల కొలువు కూడా ఇంటిలో పెడతారు.బొమ్మలను బేసి సంఖ్యలో పెడతారు. కొందరు సంక్రాంతికి కూడా పెడతారు. ఆయుధ పూజలువాహన పూజ చేస్తారు. రాజేశ్వరి ష్టకం చదివిఅమ్మవారిని దర్శించి పూలుఫలాలు సమర్పించాలి.

దేవి సంపూర్ణ అనుగ్రహం లభించితలపెట్టిన అన్ని కార్యాల లోను విజయం సిద్దిస్తుంది.

                                                                           శివార్పణం!!

1 comment:

  1. A complete guide to Slots - Casino Sites
    In this guide you will find all of the casinos where you can play w88 코리아 games with Bitcoin, 피나클 Ethereum, Litecoin 배당 토토 and more. So you 룰렛 게임 don't have to 스포티비365 travel far

    ReplyDelete