Thursday, December 5, 2013

Dasaraa navaraatrulu - 9th day - శ్రీ రాజేశ్వరి అమ్మవారు



దసరా నవరాత్రుల చివరి రోజున అమ్మవారు రాజరాజేశ్వరిగా అవతార దర్శనం ఇస్తుంది. పరాశక్తి ప్రసన్న రూపముతో కరుణని ఙ్ఞానము గా ప్రసాదిస్తుంది. మహా త్రిపుర సుందరి గా నేటి రోజున పూజలందుకుంటుంది. ఈ రోజున రాజరాజేశ్వరి అమ్మవారిని “అపరాజిత” గా పూజిస్తారు. అనగా పరాజయం కలుగక సదా జయాన్ని ప్రసాదించే శక్తి స్వరూపిణి.


రాజేశ్వరి అమ్మవారు విజయాన్ని ప్రసాదించే అపర్జిత గా,లలితాసనంలో కొలువు తీరి దర్శనం ఇస్తుంది. ఒక పాదము సింహాసనము మీద, మరొక పాదము లోపలికి ఉంచి, శ్రీ చక్రధారిని గా సింహాసనం అధిస్తుంది. శ్రీ చక్రము మీద అధిష్టించిన కారణము చేత అమ్మవారు శ్రీ చక్రధారిని అని కూడా అంటారు.


రాజేశ్వరి ఆమ్మవారికి ఈ అవతారము యందు నాలుగు చేతులు కలవు. పై భాగము నందు ఉండేది రెండు చేతులలో - ఒక చేతిలో అంకుశం (ఇది భూమి, ఆకాశం,నిప్పు.నీరు కి ప్రతీక), మరో చేతిలో పాశము ధరిస్తుంది. పాశము లౌకిక మైన విషయములు కి ప్రతీక.అమ్మవారు ఇది ధరించటం చేత సన్మార్గం మైన విషయముల మీద బుద్ధిని,మనసుని చైతన్య పరచి ఉద్ధరిస్తుంది.

క్రింది చేతిలో పద్మము, మరియు చెరుకు విల్లుని ధరిస్తుంది. చెరుకు విల్లు మనసుకి ప్రతీక. మన మనస్సుని ఈశ్వర పథం చేర్చేందుకు సన్మార్గం చూపేందుకు మన మనసుని తన ఆధీనం లో ఉంచి, సత్బుద్ధిని ప్రసాదించే
కరుణామూర్తి - రాజేశ్వరి. ఇది రాజేశ్వరి తత్వము (అపరజిత తత్వము). సదా అనిత జయములను ప్రసాదిస్తుంది.

రాజేశ్వరి దేవి అంతర్యామి స్వరూపిణి. సర్వోపస్య. సర్వబుద్దియధిష్టాన దేవి. ప్రకృతి స్వరూపిణి అయి పరమేశ్వరుని తో మూడు లోకాలను పాలిస్తుంది. జగన్మాత త్రియంబకేశ్వరి. మూడు కన్నులు సూర్య,చంద్ర ఙ్ఞానములకు
ప్రతీక. పరబ్రహ్మౌ ఒకటే. ఇది అనేక స్వరూపాలుగా దర్శనం ఇస్తుంది. లలిత, దుర్గ, గాయత్రి, లక్ష్మి, శారద, రాజేశ్వరి అంతయు ఒక్కటే. యే నామము తో పిలిచినా పరాశక్తి పలుకుతుంది.

రాజేశ్వరి లలిత స్వరూపమందు సచ్చామర రమా వాణి సవ్య దక్షిణ సేవిత (లలిత సహస్ర నామము)గా కీర్తింపబడిన శక్తిస్వరూపిణి. అనగా మూల స్వరూపములు అయిన  లక్ష్మీ, సరస్వతి తో కలిసి మధ్యన తాను నిలబడి ఙ్ఞాన ప్రచోదనం చేస్తుంది. లక్ష్మీ అనగా స్థిరమైన సంపదను, సరస్వతీ స్వరూపం అయి మోక్ష ఙ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆమె వాగ్భీజము. సర్వ విజయాలను ఇచ్చి ఉద్దరించే ప్రసన్న రూపము.

నేటి రోజున విజయ దశమి అని అంటారు. నేడు ఆయుధ పూజ చేస్తారు. విజయ దశమి  విజయానికి ప్రతీక.ఈ సమయములలో తలపెట్టిన యే కార్యమైనను విజయం సమకూరుతుంది. అమ్మవారిని  జయ మంగళ విజయ స్వరుపంగా దర్శించటమే విజయదశమి. రాముడు రావణుడి ని జయించి, సీత అమ్మవారి ని పొందిన రోజు ని కూడా పలు చోట్ల విజయ దశమి గా జరుపుకుంటారు. పది తలల రావణుడి ని సంహరించి, రాముడు విజయం సాదించటం చేత విజయ దశమి అని అంటారు. విజయ దశమి జరుపుకొనుటకు పలు చోట్ల ఇది కూడా ఒక కారణము.


దసర యందు బొమ్మల కొలువు కూడా ఇంటిలో పెడతారు.బొమ్మలను బేసి సంఖ్యలో పెడతారు. కొందరు సంక్రాంతికి కూడా పెడతారు. ఆయుధ పూజలు, వాహన పూజ చేస్తారు. రాజేశ్వరి అష్టకం చదివి, అమ్మవారిని దర్శించి పూలు, ఫలాలు సమర్పించాలి.

దేవి సంపూర్ణ అనుగ్రహం లభించి, తలపెట్టిన అన్ని కార్యాల లోను విజయం సిద్దిస్తుంది.

                                                                           శివార్పణం!!

Monday, December 2, 2013

Dasaraa navaraatrulu - 4th day - శ్రీ గాయత్రి అమ్మవారు



గాయత్రి ప్రార్థన
ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్చాయైముఖైస్త్రీక్షణై
యుక్తాం ఇందు నిబద్ధ రత్న మకుటాం తత్వార్ధ వర్ణాత్మికాం
గాయత్రీ వరదా భయాంకుషకషాః శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీం భజే


దసరా నవరాత్రి మూడవ రోజున అమ్మవారు గాయత్రి రూపంగా అనుగ్రహిస్తుంది. గాయత్రిని కొలవని వారు ఉండరు. గాయత్రిని మించిన పరమ దైవము లేదు. గాయత్రి వేద మాత. పరాశక్తి అయిన గాయత్రి 5 ముఖములతో దర్శనమిస్తుంది. నాలుగు ముఖములు నాలుగు వేదములకు గుర్తు(ఋగ్ వేదం,సామ వేదం,యజుర్ వేదం,అథర్వన వేదం). కావున గాయత్రిని
వేదోపాస్య గాయత్రి అని అంటారు. తన చేతులలో బ్రహ్మ, విష్ణువుల ఆయుధాలు అయినట్టి శంఖం, చక్రాలను మరియు అభయ, యుగల,వరద ముద్రలను ధరిస్తుంది. తల్లి పద్మం మీద కొలువు తీరి దర్శనం ఇస్తుంది. పద్మము ఙ్ఞానముకు గుర్తు. అటువంటి పద్మం మీద ఆసీనురాలు అయి, గాయత్రి ఙ్ఞానము ప్రసాదిస్తుంది.


దసరా నవరాత్రులలో గాయత్రి దర్శనం అనగా అది అమ్మవారి అవతార దర్శనం కాదు. 

నిజమైన గాయత్రి తత్వం అనగా : గాయత్రిని బాహ్యం లో అవతార దర్శనం కాదు, గాయత్రిని అంతరార్థం లో దర్శించుకోవాలి,జగన్మాత తన పర బ్రహ్మ తత్వం లో సూచించిన విషయములను పటించటం, అనగా నామరూపమైన లోకం తొలగిపోయి విశ్వం అంతా నిండినది పర బ్రహ్మరూపమే,ఆ శక్తి యె అనేక రూపములతో కొలువు తీరి ఉండటం.  ఇది - గాయత్రి తత్వ రహస్యం.


గాయత్రి మహా మంత్రం విశిష్టత: గాయత్రి మహా మంత్రము లో ఉన్నటువంటి 24 క్షరలు భీజ అక్షరములె. 24 అక్షరములకి గాను
24 –ఋషులు
24-అధిష్టాన దేవతలు కొలువై ఉంటారు.
24 తత్వాలు గాయత్రి మంత్రములో నిండి ఉంటాయి.

వీటితో పాటు-పంచ ఙ్ఞానేంద్రియాలు,
                       పంచ భూతాలు
                       పంచ కర్మేంద్రియాలు,
                       పంచ తన్మాత్రాలు
                       ప్రాణ+అపాన+ఉడాన+సమాన =అనే నాలుగు వాయువులు 
నిండి  ఉంటాయి.

విశిష్టమైన గాయత్రి జపం నేటి రోజున చేయాలి. గాయత్రి అనగా - గానము (అనగా తన స్మరణ చేసిన వారు) చేసిన వారిని రక్షించునది అని అర్థము.

గాయత్రి ఉపాసన-మూల కథ:

ఒకనాడు దేవతలు(ఇంద్రుడు,అగ్ని హొత్రుడు,వాయువు) అసురలని యుద్ధములో గెలుస్తారు. యుద్ధము గెలువటానికి ముఖ్య కారణం అయినట్టి పరాశక్తి అయిన అమ్మవారికి కృతఙ్ఞతలు తెలుపక, అంతా తాము చేసాము అనే భావము చేత గర్వముతో ఉంటారు.అమ్మవారు వారికి ఙ్ఞానోదయం చేయదలచింది. మహా తేజస్సుగా వెలిగి వారి ముందుకు వస్తుంది. ఇంద్రుడు,
అగ్నిహోత్రుడు,వాయు దేవుడు మహా తేజస్సుని చూడలేక పోతారు. అగ్నిహోత్రుడు మహా తేజస్సు దగ్గరికి వెల్లగానే, పరదేవత ఎవరు అని ప్రశ్నిస్తుంది.

అందుకు అగ్ని హోత్రుడు తను మహా శక్తి సంపన్నుడని, ఎంతటి వస్తువుని అయిన కాల్చి వేయగల శక్తి ఉన్న బలవంతుడని అహంకారంతో చెప్తాడు. పరదేవత అందుకు సమాధానముగా ఒక చిన్న గడ్డి పరకను వదిలి దానిని కాల్చి తన శక్తిని నిరూపించమని అగ్నిని అడుగుతుంది. ఎంత ప్రయత్నించినా గడ్డి పరకకి నిప్పు తాకదు. వాయువు వెళ్ళినా గడ్డి పరకను తన వాయు శక్తి తొ జరుపలేకపోతాడు. చివరికి ఇంద్రుడు వెళ్ళినా ఫలితం ఉండదు.

వారికి అప్పుడు ఙ్ఞానోదయం అవుతుంది. ఆ శక్తి పరదేవత అనే నిజం గ్రహించి తాము అనేది ఏమి లేదు అని, అహంకారాన్ని తమ నుండి పూర్తిగా తొలగించుకుని, అమ్మవారిని ప్రార్థిస్తారు. అమ్మవారు వారికి సంపూర్ణ రూపంతో దర్శనం ఇచ్చి వారి అఙ్ఞానం తొలగించేందుకు, ఙ్ఞానము మరియు సకల ఐశ్వర్యాలు, సంపదలు ప్రసాదించటానికి తనను గాయత్రిగా ఉపాసించమని వాత్సల్యంతో పలుకుతుంది.

నాటి నుండి దేవతల నుండి మనుష్యుల వరకు గాయత్రి ఉపాసన ప్రారంభమైనది. 

మహా విష్ణువు అవతారము అయినట్టి  సాక్షాత్తు శ్రీరాముడు కూడా గాయత్రి ఉపాసన చేసిన మహాత్ముడు. అట్టి సకల శుభాలకు మూలం గాయత్రి ఆరాధన. మనలోని కదలికలు, భావములు అంత ఆ దేవత కృపయే అని మనము గ్రహించటం  గాయత్రి తత్వం. ఆ తల్లి ప్రసాదించని నాడు ఙ్ఞానము అనేది ఏమి లేదు. అంతా తన అనుగ్రహమే.


దసరా నవరాత్రుల యందు అమ్మవారిని గాయత్రిగా ఉపాసించుట వలన ఙ్ఞానము లభిస్తుంది. బుద్ధి  ప్రచోదయం పొందుతుంది. బ్రహ్మాది దేవతలు కూడా గాయత్రిని ధ్యానించి జపిస్తారు. అంత శక్తివంతమైనది గాయత్రి ఉపాసన. ఆమె విశ్వమాత, సర్వ శక్తి. సర్వబుద్ధ్యాదిష్టానదేవి.

ఆ పరాశక్తిని నేటి రోజున భక్థి శ్రద్ధలతో కొలవటం చేత ప్రీతి చెంది సన్మార్గం వైపు దారి చూపి, ఈశ్వర మార్గం లో నడిచేందుకు ఙ్ఞానము ప్రసాదిస్తుంది.నేటి రోజున గాయత్రి స్తోత్రం పటించాలి. అమ్మవారి
ఊయల సేవ, దర్బారు లో పాలు పంచుకోవాలి.

గాయత్రి స్తోత్రం

ఆదిశక్తే జగన్మాత అనుగ్రహకారిణి
సర్వత్ర వ్యాపికేనంతే శ్రీసంధ్యేతే నమోస్తుతే


అర్థము: ఆది శక్తి !! జగజ్జననీ!! విశ్వవ్యాపిని, సంధ్యా దేవీ!! నీకు హృదయ పూర్వ నమస్కారాలు.
తల్లీ నీవు గాయత్రివి, సావిత్రివి, సరస్వతివి, బ్రాహ్మివి, వైష్ణవివి, సర్వ శక్తివి.

ఋగ్వేదాధ్యయినిభూమౌ దృశ్యతే యా తపస్విభిః
సమ గణాపి సర్వేషు బ్రాహ్మ్య మన తథా భువి


తల్లీ రిగ్వేదాధ్యయనానికి నీవు ఆధారము.నీవు\వేదముగ భూమి మీద కొలువు అయి ఉన్నావు. అట్టి నీకు నమస్కారములు!!

నేటి రోజు ఆది శంకరులు గాయత్రి స్వరూపముని సౌందర్య లహరి లో కీర్తించారు. నేడు ఈ శ్లోకం గాయత్రి అమ్మవారికి చదవాలి.

కవీనాం సందర్భస్తబక మకరందైక రసికం
కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగళం
అముంచంతౌ దృస్ట్వా తవ నవరసాస్వాదతరళా
వసూయా సంసర్గా దళికనయనం కించి దరుణం!! 




http://maganti.org/stotramalika/soundaryalahari.pdf


                                                       శివార్పణం!!