Monday, December 2, 2013

Dasaraa navaraatrulu - 4th day - శ్రీ గాయత్రి అమ్మవారు



గాయత్రి ప్రార్థన
ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్చాయైముఖైస్త్రీక్షణై
యుక్తాం ఇందు నిబద్ధ రత్న మకుటాం తత్వార్ధ వర్ణాత్మికాం
ాయత్రీ వరదా భయాంకుషకషాః శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీం భజే


దసరా నవరాత్రి మూడవ రోజున అమ్మవారు గాయత్రి రూపంగా అనుగ్రహిస్తుందిగాయత్రిని కొలవని వారు ఉండరు. గాయత్రిని మించిన పరమ దైవము లేదుగాయత్రి వేద మాత. పరాశక్తి అయిన గాయత్రి 5 ముఖములతో దర్శనమిస్తుందినాలుగు ముఖములు నాలుగు వేదములకు గుర్తు(ఋగ్ వేదం,సామ వేదం,యజుర్ వేదం,అథర్వన వేదం). కావున గాయత్రిని
వేదోపాస్య గాయత్రి అని అంటారు. తన చేతులలో బ్రహ్మవిష్ణువుల ఆయుధాలు అయినట్టి శంఖంచక్రాలను మరియు అభయయుగల,వరద ముద్రలను ధరిస్తుందితల్లి పద్మం మీద కొలువు తీరి దర్శనం ఇస్తుందిపద్మము ఙ్ఞానముకు గుర్తు. అటువంటి పద్మం మీద ఆసీనురాలు అయిగాయత్రి ఙ్ఞానము ప్రసాదిస్తుంది.


దసరా నవరాత్రులలో గాయత్రి దర్శనం అనగా అది అమ్మవారి అవతార దర్శనం కాదు

నిజమైన గాయత్రి తత్వం అనగా : గాయత్రిని బాహ్యం లో అవతార దర్శనం కాదుగాయత్రిని అంతరార్థం లో దర్శించుకోవాలి,జగన్మాత తన పర బ్రహ్మ తత్వం లో సూచించిన విషయములను పటించటం, అనగా నామరూపమైన లోకం తొలగిపోయి విశ్వం అంతా నిండినది పర బ్రహ్మరూపమే, శక్తి యె అనేక రూపములతో కొలువు తీరి ఉండటం.  ఇది - గాయత్రి తత్వ రహస్యం.


గాయత్రి మహా మంత్రం విశిష్టత: గాయత్రి మహా మంత్రము లో ఉన్నటువంటి 24 క్షరలు భీజ అక్షరములె. 24 అక్షరములకి గాను
24 –ఋషులు
24-అధిష్టాన దేవతలు కొలువై ఉంటారు.
24 తత్వాలు గాయత్రి మంత్రములో నిండి ఉంటాయి.

వీటితో పాటు-పంచ ఙ్ఞానేంద్రియాలు,
                       పంచ భూతాలు
                       పంచ కర్మేంద్రియాలు,
                       పంచ తన్మాత్రాలు
                       ప్రా+పా+డా+మా =అనే నాలుగు వాయువులు 
నిండి  ఉంటాయి.

విశిష్టమైన గాయత్రి జపం నేటి రోజున చేయాలి. గాయత్రి అనగా గానము (అనగా తన స్మరణ చేసిన వారు) చేసిన వారిని రక్షించునది అని అర్థము.

గాయత్రి ఉపాసన-మూల కథ:

ఒకనాడు దేవతలు(ఇంద్రుడు,అగ్ని హొత్రుడు,వాయువు) అసురలని యుద్ధములో గెలుస్తారుయుద్ధము గెలువటానికి ముఖ్య కారణం అయినట్టి పరాశక్తి అయిన అమ్మవారికి కృతఙ్ఞతలు తెలుపకఅంతా తాము చేసాము అనే భావము చేత గర్వముతో ఉంటారు.అమ్మవారు వారికి ఙ్ఞానోదయం చేయదలచింది. మహా తేజస్సుగా వెలిగి వారి ముందుకు వస్తుందిఇంద్రుడు,
అగ్నిహోత్రుడు,వాయు దేవుడు మహా తేజస్సుని చూడలేక పోతారుఅగ్నిహోత్రుడు మహా తేజస్సు దగ్గరికి వెల్లగానేపరదేవత ఎవరు అని ప్రశ్నిస్తుంది.

అందుకు అగ్ని హోత్రుడు తను మహా శక్తి సంపన్నుడనిఎంతటి వస్తువుని అయిన కాల్చి వేయగల శక్తి ఉన్న బలవంతుడని అహంకారంతో చెప్తాడు. పరదేవత అందుకు సమాధానముగా ఒక చిన్న గడ్డి పరకను వదిలి దానిని కాల్చి తన శక్తిని నిరూపించమని అగ్నిని అడుగుతుంది. ఎంత ప్రయత్నించినా గడ్డి పరకకి నిప్పు తాకదువాయువు వెళ్ళినా గడ్డి పరకను తన వాయు శక్తి తొ జరుపలేకపోతాడుచివరికి ఇంద్రుడు వెళ్ళినా ఫలితం ఉండదు.

వారికి అప్పుడు ఙ్ఞానోదయం అవుతుంది శక్తి పరదేవత అనే నిజం గ్రహించి తాము అనేది ఏమి లేదు అనిఅహంకారాన్ని తమ నుండి పూర్తిగా తొలగించుకునిఅమ్మవారిని ప్రార్థిస్తారుఅమ్మవారు వారికి సంపూర్ణ రూపంతో దర్శనం ఇచ్చి వారి అఙ్ఞానం తొలగించేందుకుఙ్ఞానము మరియు సకల ఐశ్వర్యాలుసంపదలు ప్రసాదించటానికి తనను గాయత్రిగా పాసించమని వాత్సల్యంతో పలుకుతుంది.

నాటి నుండి దేవతల నుండి మనుష్యుల వరకు గాయత్రి ఉపాసన ప్రారంభమైనది

మహా విష్ణువు అవతారము అయినట్టి  సాక్షాత్తు శ్రీరాముడు కూడా గాయత్రి ఉపాసన చేసిన మహాత్ముడు. అట్టి సకల శుభాలకు మూలం గాయత్రి ఆరాధనమనలోని కదలికలుభావములు అంత దేవత కృపయే అని మనము గ్రహించటం  గాయత్రి తత్వం తల్లి ప్రసాదించని నాడు ఙ్ఞానము అనేది ఏమి లేదు. అంతా తన అనుగ్రహమే.


దసరా నవరాత్రుల యందు అమ్మవారిని గాయత్రిగా ఉపాసించుట వలన ఙ్ఞానము లభిస్తుంది. బుద్ధి  ప్రచోదయం పొందుతుందిబ్రహ్మాది దేవతలు కూడా గాయత్రిని ధ్యానించి జపిస్తారు. అంత క్తివంతమైనది గాయత్రి ఉపాసన. ఆమె విశ్వమాత, సర్వ శక్తి. సర్వబుద్ధ్యాదిష్టానదేవి.

పరాశక్తిని నేటి రోజున భక్థి శ్రద్ధలతో కొలవటం చేత ప్రీతి చెంది సన్మార్గం వైపు దారి చూపిఈశ్వర మార్గం లో నడిచేందుకు ఙ్ఞానము ప్రసాదిస్తుంది.నేటి రోజున గాయత్రి స్తోత్రం పటించాలి. అమ్మవారి
ఊయల సేవదర్బారు లో పాలు పంచుకోవాలి.

గాయత్రి స్తోత్రం

ఆదిశక్తే జగన్మాత అనుగ్రహకారిణి
సర్వత్ర వ్యాపికేనంతే శ్రీసంధ్యేతే నమోస్తుతే


అర్థము: ఆది శక్తి !! జగజ్జననీ!! విశ్వవ్యాపిని, సంధ్యా దేవీ!! నీకు హృదయ పూర్వ నమస్కారాలు.
తల్లీ నీవు గాయత్రివిసావిత్రివిసరస్వతివిబ్రాహ్మివివైష్ణవివి, సర్వ శక్తివి.

ఋగ్వేదాధ్యయినిభూమౌ దృశ్యతే యా తపస్విభిః
సమ గణాపి సర్వేషు బ్రాహ్మ్య మన తథా భువి


తల్లీ రిగ్వేదాధ్యయనానికి నీవు ఆధారము.నీవు\వేదముగ భూమి మీద కొలువు అయి ఉన్నావుఅట్టి నీకు నమస్కారములు!!

నేటి రోజు ఆది శంకరులు గాయత్రి స్వరూపముని సౌందర్య లహరి లో కీర్తించారునేడు శ్లోకం గాయత్రి అమ్మవారికి చదవాలి.

కవీనాం సందర్భస్తబక మకరందైక రసికం
కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగళం
అముంచంతౌ దృస్ట్వా తవ నవరసాస్వాదతరళా
వసూయా సంసర్గా దళికనయనం కించి దరుణం!! 




http://maganti.org/stotramalika/soundaryalahari.pdf


                                                       శివార్పణం!!

No comments:

Post a Comment