Monday, May 6, 2013

మహాశివరాత్రి - Mahaa Sivaraatri

వాగర్ధావివ సంపౄక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ 


వాక్కు అర్థము అన్నవి విడిగా ఉన్నా విడదీయలేనివి. అటువంటి ఆది దంపతులగు పార్వతీపరమేశ్వరులకు నా వందనం.   
                              లోకరక్షకుడు అయినటువంటి పరమేశ్వరుడు, సదాశివుడు - అనగా సర్వ మంగళానికి ప్రతీక. సమస్త లోకాలు ఓంకార నాదం నుండి పుట్టినటువంటివి. ఆది-అంతము, చతుర్వేదములు, వేదాల సారం మరియు ఉపనిషత్తులకి సర్వేశ్వరుడే మూలం. కారణం చేతనే శ్రీ రుద్రము విధముగా నీలకంఠుడిని కొలుస్తోంది.
 
నమః సోమాయ రుద్రాయ - నమస్తామ్రాయచ అరుణాయచ
నమః శంగాయచ పశుపతయే చ - నమః ఉగ్రాయ భీమాయ
నమొ అగ్రేవధాయ దురేవధాయ - నమో హంత్రే హనియసే
నమొ వృక్షేభ్యొ  హరికేషేభ్యొ - నమస్తారాయ నమః శాంభవే మయోభవే
నమః శంకరాయ మయస్కరాయ - నమః శివాయ శివతరాయ
నమస్తీర్థాయ కుల్యాయ  - నమః పర్యాయ వర్యాయ
నమః ప్రతరణాయ చోత్తరణాయచ - నమః అతర్యాయ లాద్యాయ
నమః శష్ప్యాయ ఫెన్యాయ - నమః సికత్యాయ ప్రవాహ్యాయ
 
అర్థం: సృస్టికి మూలం అయినటువంటి పరమేశ్వరునికి, ప్రణవ మంత్రం అయినటువంటి నీలకంఠునికి, కష్టం సుఖం అనే జీవితం ఇచ్చినటువంటి కరుణ మూర్తికి, చిత్తశుద్ధితో ప్రాణ కోటిని నడిపించే ఈశ్వరునికి శతకోటి నమస్కారాలు 
ఇటువంటి కరుణమూర్తి అయిన పరమేశ్వరునికి అత్యంత ముఖ్యమైన రోజు మహాశివరాత్రి. మహాశివరాత్రి జరపబడటానికి ముఖ్యంగా 3 కారణాలు కలవు.

1. ఫాల్గుణ మాసం కృష్ణపక్షం - చతుర్దశి లేదా త్రయోదశి వచ్చే రాత్రి పరమేశ్వరుని లింగోద్భవ కాలమును మహాశివరాత్రి గా చేసుకుంటాం. ఇది ముఖ్యమైన కారణం. శివుడు లింగాకారమున సృస్టిని ఉద్ధరిస్తూ సకల సంపదలు ప్రసాదిస్తాడు.

2. అమృతం కోసం సురులు, అసురులు సముద్రమును చిలుకగా వచ్చిన విషం లోకాన్ని బాధిస్తున్నపుడు, సకల దేవతలు ఆదిదంపతులకు ప్రార్ధించగా, శివుడు లోకరక్షణ కొరకు విషాన్ని తన కంఠంలో నింపుకుని నీలకంఠుడు - గరళకంఠుడు  అయ్యాడు. లోక రక్షణ చేసిన మహాదినాన శివరాత్రిగా కొన్ని ప్రదేశాలలో జరుపుకుంటారు.

3. పార్వతీకల్యాణం కూడ శివరాత్రి జరుపుకోవటానికి ఒక కారణంగా చెప్పవచ్చు. శివమహాపురాణంలో ప్రస్తావన వస్తుంది. జగన్మాత, మహాశక్తి అయినటువంటి పార్వతి దేవి పరమేశ్వరుని వివాహం చేస్కోవటం ఇదే రోజున జరగటం వల్ల శివరాత్రి జరుపుకుంటామని ప్రస్తావన. దేవిభాగవతం మరియు మహాశివపురాణం విషయానికి ముఖ్యమైన ఆధారములు. జగన్మాత పార్వతి ఎన్నో అవతారాలు తీసుకుంది, ఎందరికో కుమార్తెగా వచ్చి వారిని అనుగ్రహించింది. దేవిభాగవతం, శివమహాపురాణం నందు ప్రస్తావించినట్టు - పార్వతి దేవి

దక్షుని అనుగ్రహించింది - దాక్షాయిని అయింది
హిమవంతుని అనుగ్రహించింది - హైమవతి అయింది
పర్వత రాజుని అనుగ్రహించింది - పార్వతి అయింది
జనక మహారాజును అనుగ్రహించింది - జానకి అయింది
ఆకాశరాజుని అనుగ్రహించింది - పద్మావతి అయింది
మనిధ్వజుని అనుగ్రహించింది - మీనాక్షి అయింది
భ్రుగువుని అనుగ్రహించింది - భార్గవి అయింది
కాత్యయనుడిని అనుగ్రహించింది - కాత్యాయిని అయింది
 

అట్టి మహాస్వరూపం జగన్మాత లోకాలకు కరుణమూర్తి అయినటువంటి పార్వతి ఎన్ని అవతారాలు ఎత్తినా, ఎన్ని స్వరూపాలలో దర్శనం ఇచ్చినా - చివరికి అన్ని జన్మలలో ఆమె పరమేశ్వరునికి ఇల్లాలు మరియు లోకాలని కరుణించే ప్రసన్నమూర్తి. ఇది సత్యం, వేదాలు మరియు సాక్షాత్తు పరమేశ్వరుడు ఇచ్చిన తీర్పు.
మనోహరమైన పార్వతి - శివ కల్యాణం లోకానికి రక్ష.
 పూజావిధానం:
                  శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన, పవిత్రమైన బిల్వ పత్రాలతో స్నానం చేసి దేవదేవునకు పుష్పములు, ఫలములు కృతజ్ఞతా భావంతో నివేదించాలి. పర్వదినాన - తేనె, ఆవు పాలు, పండ్లు, పుష్పాలు, ఇతర పూజ సామగ్రితో రుద్రాభిషేకం చేయటం శ్రేస్ఠం. శివరాత్రినాడు ఉపవాస దీక్షలొ ఉండి, రోజంతా భక్తితో శివనామ జపం చేసిన వారు శివుని కృపకు పాతృలు కాగలరు.

శివరాత్రి రాత్రంతా శివుని ప్రార్ధిస్తూ, కీర్తిస్తూ, స్తుతిస్తూ చేసే జాగరణ శ్రేష్ఠం, ఫలదాయకం. 
ఓం నమః శివాయ
 

No comments:

Post a Comment