దసరా
నవరాత్రుల చివరి రోజున అమ్మవారు
రాజరాజేశ్వరిగా అవతార దర్శనం ఇస్తుంది.
పరాశక్తి ప్రసన్న రూపముతో కరుణని ఙ్ఞానము గా ప్రసాదిస్తుంది. మహా
త్రిపుర సుందరి గా నేటి రోజున
పూజలందుకుంటుంది. ఈ రోజున రాజరాజేశ్వరి అమ్మవారిని
“అపరాజిత” గా పూజిస్తారు. అనగా పరాజయం
కలుగక సదా జయాన్ని ప్రసాదించే
శక్తి స్వరూపిణి.
రాజేశ్వరి
అమ్మవారు విజయాన్ని ప్రసాదించే అపర్జిత గా,లలితాసనంలో కొలువు
తీరి దర్శనం ఇస్తుంది. ఒక పాదము సింహాసనము
మీద, మరొక పాదము లోపలికి
ఉంచి, శ్రీ చక్రధారిని గా
సింహాసనం అధిస్తుంది. శ్రీ చక్రము మీద అధిష్టించిన
కారణము చేత అమ్మవారు శ్రీ
చక్రధారిని అని కూడా అంటారు.
రాజేశ్వరి
ఆమ్మవారికి ఈ అవతారము యందు
నాలుగు చేతులు కలవు. పై భాగము నందు ఉండేది
రెండు చేతులలో - ఒక చేతిలో అంకుశం (ఇది భూమి, ఆకాశం,నిప్పు.నీరు కి ప్రతీక), మరో చేతిలో పాశము ధరిస్తుంది. పాశము లౌకిక మైన విషయములు కి ప్రతీక.అమ్మవారు ఇది ధరించటం చేత సన్మార్గం మైన విషయముల మీద బుద్ధిని,మనసుని చైతన్య పరచి ఉద్ధరిస్తుంది.
క్రింది
చేతిలో పద్మము, మరియు చెరుకు విల్లుని
ధరిస్తుంది. చెరుకు విల్లు మనసుకి ప్రతీక. మన మనస్సుని ఈశ్వర
పథం చేర్చేందుకు సన్మార్గం చూపేందుకు మన మనసుని తన
ఆధీనం లో ఉంచి, సత్బుద్ధిని
ప్రసాదించే
కరుణామూర్తి - రాజేశ్వరి. ఇది రాజేశ్వరి తత్వము (అపరజిత తత్వము). సదా అనిత జయములను ప్రసాదిస్తుంది.
రాజేశ్వరి
దేవి అంతర్యామి స్వరూపిణి. సర్వోపస్య. సర్వబుద్దియధిష్టాన దేవి. ప్రకృతి
స్వరూపిణి అయి పరమేశ్వరుని తో
మూడు లోకాలను పాలిస్తుంది. జగన్మాత
త్రియంబకేశ్వరి. మూడు కన్నులు సూర్య,చంద్ర ఙ్ఞానములకు
ప్రతీక. పరబ్రహ్మౌ
ఒకటే. ఇది అనేక స్వరూపాలుగా
దర్శనం ఇస్తుంది. లలిత, దుర్గ, గాయత్రి, లక్ష్మి, శారద, రాజేశ్వరి అంతయు
ఒక్కటే. యే నామము తో పిలిచినా పరాశక్తి పలుకుతుంది.
రాజేశ్వరి
లలిత స్వరూపమందు సచ్చామర రమా వాణి సవ్య దక్షిణ సేవిత (లలిత
సహస్ర నామము)గా కీర్తింపబడిన
శక్తిస్వరూపిణి. అనగా మూల స్వరూపములు
అయిన లక్ష్మీ, సరస్వతి తో కలిసి మధ్యన
తాను నిలబడి ఙ్ఞాన ప్రచోదనం చేస్తుంది. లక్ష్మీ అనగా స్థిరమైన సంపదను, సరస్వతీ స్వరూపం అయి మోక్ష ఙ్ఞానాన్ని
ప్రసాదిస్తుంది. ఆమె వాగ్భీజము. సర్వ
విజయాలను ఇచ్చి ఉద్దరించే ప్రసన్న
రూపము.
నేటి
రోజున విజయ దశమి అని
అంటారు. నేడు ఆయుధ పూజ
చేస్తారు. విజయ
దశమి విజయానికి ప్రతీక.ఈ సమయములలో తలపెట్టిన
యే కార్యమైనను విజయం
సమకూరుతుంది. అమ్మవారిని
జయ మంగళ విజయ స్వరుపంగా
దర్శించటమే విజయదశమి. రాముడు
రావణుడి ని జయించి, సీత
అమ్మవారి ని పొందిన రోజు
ని కూడా పలు చోట్ల
విజయ దశమి గా జరుపుకుంటారు. పది తలల రావణుడి
ని సంహరించి, రాముడు విజయం సాదించటం చేత
విజయ దశమి అని అంటారు. విజయ
దశమి జరుపుకొనుటకు పలు చోట్ల ఇది
కూడా ఒక కారణము.
దసర యందు బొమ్మల కొలువు
కూడా ఇంటిలో పెడతారు.బొమ్మలను బేసి సంఖ్యలో పెడతారు. కొందరు సంక్రాంతికి కూడా పెడతారు. ఆయుధ
పూజలు, వాహన పూజ చేస్తారు.
రాజేశ్వరి అష్టకం చదివి, అమ్మవారిని దర్శించి
పూలు, ఫలాలు సమర్పించాలి.
దేవి
సంపూర్ణ అనుగ్రహం లభించి, తలపెట్టిన అన్ని కార్యాల లోను విజయం
సిద్దిస్తుంది.
శివార్పణం!!
శివార్పణం!!